Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
తెెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ఆర్భాటంగా 'డబుల్' ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమై,కొన్ని గ్రామాల్లో మాత్రమే నేటి వరకు పంపిణీ చేసింది.మరి కొన్ని గ్రామాలలో పంపిణికిసిద్ధంగా ఉన్నా పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో లక్షలాది రూపాయల ఖర్చుతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాక అసంపూర్తిగా ఉన్నాయి.మరికొన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిóలావస్థకు చేరుకున్నాయి.ప్రతి గ్రామంలో సుమారు 300 నుండి 500 మందికి పైగా సొంతిండ్లు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు.వారికి సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం ద్వారా రూ.3 లక్షల ఆర్థికసాయం అందించి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని చెబుతున్నారు.పేదలు ఇండ్లు నిర్మాణం చేసుకొవాలని, పూరి గుడిసెల్లో ఎవరు నివాసాలు ఉండకూడదని ప్రతి ఒక్కరికి సొంతింటి కల సహకారం కావాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.2022-2023 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని వివిధ సందర్భాలలో స్వయంగా రాష్ట్ర మంత్రులే చెప్తుండడంతో ఆర్థిక సమస్యల కారణంగా ఖాళీ జాగా ఉండి కూడా ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారు కేసీఆర్ ఎప్పుడు పథకాన్ని అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు.మార్చి నెలలో అసెంబ్లీ సాక్షిగా పేదల ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం ద్వారా పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని మరో మారు ప్రకటన చేశారు. దీంతో మరో మారు పేదల సొంత ఇంటి కల కలగానే మిగిలింది.ఈ లోపు ఎన్నికలు వస్తే పేదలకు సొంతిండ్లు దక్కే పరిస్థితి లేదు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇంటి నిర్మాణానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మాటల గారడి చేస్తున్న ప్రభుత్వం
చైతన్య యువజన మండలి అధ్యక్షులు-భాషపంగు సునీల్్
కొట్లాడి తెచ్చున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నరకయాతన పడుతున్నారు.మాటల గారడీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలనుమభ్యపెడుతూ కాలమెళ్లదీస్తున్నాడు.సీఎంకేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ జాగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు అందజేయాలి.
త్వరితగతిన పేదలఇంటినిర్మాణంచేపట్టాలి
వ్యవసాయకార్మికసంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి-మట్టిపెళ్లిసైదులు
9 ఏండ్ల నుండి లక్షలాది మంది పేదలు సొంతింటి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేడు.పేదల సొంతింటిి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలి.గత9 ఏండ్ల నుండి సొంత జాగా కలిగి ఉన్న వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ,రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ వస్తుంది తప్ప నేటికీ పేదల ఇంటి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. ఈ కాలంలో అనేకమంది ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు సంసారం చేస్తూ జీవిస్తున్నారు.కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి..కానీ కాళ్లు గడప దాటడం లేదు.రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం విధి విధానాలు రూపొందించి పేదల సొంతింటి కలను నిజం చేయాలి. లేనియెడల రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.
కేసీఆర్ను గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
వైఎస్సార్ తెలంగాణ యువజన నాయకులు-రఫీ
మాటల గారడీలతో తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు ముందే ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలి.లేకపోతే సరైన మూల్యం చెల్లించక తప్పదు.