Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
2003-04 పదోవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మండలకేంద్రంలోని రవి హైస్కూల్ నందు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003-04 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత కలవడం జరిగిందని, పూర్వ విద్యార్థులు ఎంతో సంబరాలు జరుపుకొని, తమకి చదువు చెప్పిన గురువులు గారికి ధన్యవాదములు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి సంవత్సరం అందరు కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. అనంతరం రవి హైస్కూల్ ప్రిన్సిపాల్ పాపట్ల జాకబ్కుమార్కు, వారి సతీమణి అశోకలను ఆహ్వానించి శాలువాతో సన్మానించారు.షీల్డ్ తో పాటు, బట్టలు పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండలు, రవి, కృష్ణా, విద్యార్థులు అబ్దుల్ రహీం, రఫీ, అన్వర్, అన్వర్పాషా, వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాసరెడ్డి, నర్సింహ రావు, రమేష్, ఏడుకొండలు, సౌజన్య, రహీమా,దివ్య తదితరులు పాల్గొన్నారు.