Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.సోమవారం తుంగతుర్తి మండలకేంద్రంలో జరుగుతున్న యాదవుల ఆరాధ్య దైవం సౌనమ్మ పండుగ మహోత్సవానికి హాజరై, అమ్మవారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించి,యాదవ సోదరులతో కలిసి సాంప్రదాయ బేరీలు మ్రోగించి,కటారులతో విన్యాసాలు చేసి మాట్లాడారు. ఈ మేరకు గ్రామదేవతలకు చేసే ఈ పండుగల ద్వారా గ్రామాలలో ఐక్యమత్యం, సోదర భావం పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు తాటికొండ సీతయ్య, భారతీయ రాష్ట్ర సమితి కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణగౌడ్, జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్,మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.