Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో అనేక ఏండ్లుగా ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న పేదలకు భూమిపై హక్కులు కల్పించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని సోమవారం పలువురు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ వెంకట నగేష్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎంతో ఖర్చు చేసి వ్యయ ప్రయాసలకోర్చి రాళ్లు, రప్పలు, చెట్లను తొలగించి భూమిని సేద్యంలోకి తీసుకువచ్చా మన్నారు. కాపుగల్లు గ్రామ రెవెన్యూపరిధిలోని సర్వేనెంబర్101, 133,292,332,420 లో నిరుపేదలమైన తాము అనేకఏండ్లుగా అదే భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయిలో అందరికీ భూమిపై హక్కులు కల్పించాలన్నారు.అదేవిధంగా అట్టి భూమిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే ప్రయత్నాలను విరమింప చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా బోస్‌బాబు, కర్లపూడి వీరబాబు, శ్రీను, త్రినాధ్, శివ,విజయలక్ష్మీ, సత్యవతి, సైదమ్మ,కోటమ్మ, ఫ్రాన్సిస్,సాయి తదితరులు పాల్గొన్నారు.