Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 79 మంది లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ,షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు..ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మెన్ ఇరిగి పెద్దులు,జెడ్పీటీసీ భారతి, ఎంపీపీ పాండమ్మ,తహసీల్దార్ ప్రమీల, మార్కెట్ చైర్మెన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు బహునుతల నరేందర్, మాజీ ఎంపీపీ దూళిపాలరామచంద్రయ్య, జిల్లా దళిత బంధు డైరెక్టర్ మడుపు వెంకటేశ్వర్లు, మండల ప్రధానకార్యదర్శి వెంకటాచారి, సర్పంచులు అనుముల శ్రీనివాసరెడ్డి,కలగానిశ్రవణ్, కలకొండ వెంకటమ్మ పాల్తి శ్రీను, సైదయ్య, ధనావత్ బుజ్జిజయరాంనాయక్,దాసరి అడవయ్య,మద్దూరి శ్రీను, జొన్నలగడ్డ రమేష్‌రెడ్డి, రేవూరు వెన్నెల, ఎంపీటీసీలు అంబటి రాము, రవి, మార్కెట్ డైరెక్టర్లు దైద రవి,తిక్కనపోయిన నాగరాజు, మహిళా మండల అధ్యక్షురాలు మాద ధనలక్ష్మి, వెంకటేష్, బైరం కృష్ణ,జంగలి శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ఎస్సైగా సురేష్
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నందికొండ నూతన ఎస్ఐగా వి.సురేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నందికొండలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు.అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీసు సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు.గతంలో ఎస్ఐగా పనిచేసిన రాంబాబు డీసీఆర్బీ నల్లగొండకు బదిలీ అయ్యారు.