Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 వారాలు గడిచినా కూలీలకు అందని వేతనాలు
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
ఉపాధి హామీలో ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీల పట్ల నిర్లక్ష్యం తగదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ అన్నారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పుట్టపాక గ్రామంలో ఉపాధికూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి వారితో మాట్లాడారు.పది వారాలుగా ఎర్రటి ఎండలో పనిచేస్తున్న తమకు కూలీ డబ్బులు చెల్లించడం లేదని కూలీలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.పనిచేసిన వారంలోపు కూలీ డబ్బులు చెల్లించాలని చట్టంలో ఉన్నప్పటికీ ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. పని ప్రదేశంలో దగ్గర తాగడానికి మంచినీళ్లు, నీడ కోసం టెంటు, మెడికల్ కిట్టు, చంటి పిల్లలను ఎత్తుకోవడానికి కూడా పని మనుషులు వంటి సౌకర్యాలను కూడా తగ్గించిందన్నారు. . ఇప్పటికైనా ప్రభుత్వం చట్టంలో ఉన్న ప్రకారం పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుంటూజు శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దులు, జిల్లా కమిటీ సభ్యులు పిట్ట రాములు, మండల ఉపాధ్యక్షులు గాజుల అంజయ్య ,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ కోఅడ్ నేటర్ సుక్క విమల,కార్మికులు బోయిని ఇందిరమ్మ, పిట్ట ఎల్లమ్మ,ఎర్పుల భారతమ్మ, సుక్క సప్న, బుర్రి అచ్చమ్మ, పిట్ట హరిత, సుక్క యాదమ్మ, సుక్క రజిత,ఎర్పుల మంజుల, సుక్క పుష్ప,తలారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.