Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్
నవతెలంగాణ- భువనగిరి రూరల్
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థాయి అధికారులతో కమిషనర్ డీఎస్ చౌహాన్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిథిలో జరిగే నేరాలను అరికట్టాలని, ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేర పరిశోధనలో, సాంకేతిక ఆధారాలను , సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల కమిషనరేట్ పరిధిలో వివిధ రకాల నేరాల శాతం చాలా తగ్గిందని కమిషనర్ గుర్తు చేశారు. నేర దర్యాప్తులో సివిల్ , ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలు, సాంకేతిక విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అటువంటి వాహన యాజమానుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ తమ పొలీస్ స్టేషన్లు , విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందిలో బాగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వారికి రివార్డులు ఇవ్వబడతాయన్నారు. వారి వివరాలు పై అధికారులకు పంపిస్తూ ఉండాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో మంజూరు చేసిన నూతన పొలీస్ స్టేషన్లు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, మల్కాజిగిరి డీసీపీ జానకి , యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపి రాజేష్ చంద్ర , ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ , ఎస్ఓటి డీసీపీ గిరిధర్ , ఎస్ఓటి డీసీపీ మురళీధర్, క్రైమ్ డీసీపీ మధుకర్ స్వామి, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీ బాల, అడ్మిన్ డీసీపీ ఇందిర, అడ్మిన్ అదనపు డీసీపీ నర్మద, అదనపు డీసీపీ షమీర్ పాల్గొన్నారు.
మరిన్ని పతకాలు సాధించాలి
భువనగిరి : ఫిబ్రవరి 3 నుంచి5 తేదీ వరకు హైదరాబాదులో జరిగిన ఆలిండియా మాస్టర్ గేమ్స్ లో అథ్లెటిక్స్ లో రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించిన భువనగిరి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంబొజు అనిల్ కుమార్ను రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహన్ ఐపిఎస్ తన కార్యాలయంలో మంగళవారం అభినందిం చారు. త్వరలో దక్షిణ కొరియాలో ఈ నెల 12తేది నుండి 20 వ తేదీ వరకు జరుగనున్న ఆసియా పసిఫిక్ మాస్టర్ గేమ్స్ లో అథ్లెటిక్స్ 800 మీటర్లు ,1500 మీటర్ల పరుగులో పాల్గొనడానికి అర్హత సాధించిన అనిల్ కుమార్ ను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, సిఎఆర్ అదనపు డీసీపీ హనొక్ జయకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు..