Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో భువనగిరి పట్టణంలోని టైమ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అన్ని విభాగాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించిన ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బోటనీ వెంకన్న, యాజమాన్యం అమితేష్ రాయి, అవినాష్ రారు లు జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీి విభాగంలో- ముగ్ధం కుస్మిత 466/470, ఏనుగు సింధు ప్రియా 464, షిఫా 464, ఆంచల్ యాదవ్ 463, రాంపల్లి శిరీష 463, దుష్మత్ రెడ్డి 462 అఖిల 461. బైపీసీ విభాగంలో ముల్లె రిషిత, 435/440 రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా, జబ 422, మేఘన 416 అంజలి 408, జాస్మిన్ 405, సిఇసి విభాగంలో సాదం వసుంధర 487/500, రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా అస్రా బేగం 475, సాయి ప్రసన్న 474, స్పందన 471 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం - ఎంపిసి విభాగంలో కొప్పుల సుస్మిత 989/1000 రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా హర్షిత్ సాయినాథ్ 986, వెల్దుర్తి అమూల్య 983, బైపీసీ విభాగంలో బింగి సాయి పవిత్ర 981, దీక్షిత 975, ఈతాప పూజిత 973, లక్ష్మీ ప్రసన్న 968, నీలం సత్యలక్ష్మి 968, గోపరాజు దీపిక 965, సిఇసి విభాగంలో బింగి ప్రేమ శ్రీ 979/1000 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా, పడమటి వైష్ణవి 978, కుసుమ శ్వేత 973, ఇప్ప సీమ 963 ఉత్తమ మార్కులు సాధించారు.ఈ సందర్భంగా అమితేష్ రాయి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.