Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా కేంద్రాలను సందర్శించాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైస్‌మిల్లర్లకు కేటాయించిన ధాన్యం దిగుమతి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు.మంగళవారం మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.అంతకుముందు వ్యవసాయ అధికారులు మానిటరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లర్ల సూచన మేరకు ధాన్యం దిగుమతి లక్ష్యాన్ని తగ్గించామని తెలిపారు.సన్నరకం ధాన్యం ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల మిల్లులలో స్థలం లేకపోవడంతో మిల్లర్ల సూచన మేరకు ధాన్యం దిగుమతి లక్ష్యం 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లక్ష్యం ఇచ్చినట్లు తెలిపారు.ఇందులో ఇప్పటివరకు 80 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నారన్నారు. మిగిలిన 40 వేల టన్నుల ధాన్యం దిగుమతి వెంటనే చేపట్టాలని సూచించారు. ధాన్యం తక్కువ దిగుమతి చేసుకున్న మిల్లర్లు తమ కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు.కొన్ని మిల్లులకే ధాన్యం అలాట్మెంట్ చేయడం కాదని, లోడింగ్ బట్టి ఆయా మిల్లులకు విభజించి పంపిణీ చేయాలని కోరారు.అన్ని మిల్లులకు ధాన్యం వెళ్ళే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజు కొనుగోలుకేంద్రాలకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి సర్టిఫైడ్ చేయాలని ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు.ఈ సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏడీఏ నాగమణి, సీవిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణారెడ్డి,మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్,కార్యదర్శి వెంకటరమణాచౌదరి, సివిల్ సప్లై ఆర్ఐ సురేందర్సింగ్, వ్యవసాయ, మానిటరింగ్ అధికారులు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.