Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లాప్రదాన కార్యదర్శి నారిఐలయ్య
నవతెలంగాణ-కట్టంగూర్
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రదాన కార్యదర్శినారిఐలయ్య విమర్శించారు.మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయిటి పాముల గ్రామ లో జరుగుతన్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను.అడిగితెలుసుకున్నారు. ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని అలాగే చట్టం స్ఫూర్తికివిరుద్ధంగా నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతుందని అందోళన వ్యక్తం చేశారు.ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన 272రూపాల కూలి ఎక్కడ కూడ రావడం లేదని ముఖ్యంగా ఎండలను దష్ట లో పెట్టుకోని మె నెలలో కొలతలతో నిమిత్తం లేకుండ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు ఇచ్చే విధంగా చర్య లు తీసుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా వీటిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కూలీల కనీస వేతనాల జీవోలను సవరించి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆ సంఘం మండల అధ్యక్షులు ఇటికల సురేందర్ ఎపి కడెం రాంమోహన్ యఫ్ఏ లక్ష్మణ్ మండలానికి సభ్యులు రమేశ్.గ్రామ అధ్యక్షులు నక్కలవినోద, కార్యదర్శి చిట్టిపాక రమేశ్ నాయకులు దాసరి చంద్రకళ,రోడ్డ లావణ్య, తండు విజయ, గంటేకంపు జానకమ్మ, బోళ్లజ్యోతి, బేజవాడ పద్మావతి, సింగూరు లక్ష్మి, పాల్గొన్నారు.