Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూజిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మినారాయణ
నవతెలంగాణ -నకిరేకల్
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఐకెపి వీవోఏ లను సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఐకెపి వివోఏలు చేస్తున్న సమ్మె మంగళవారం 23వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని లక్ష్మీనారాయణ సందర్శించి మాట్లాడారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో సుమారు 18 వేల మంది వివోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా 19 సంవత్సరాల నుండి అనేక కష్టనష్టాలకోర్చి రూ. 3900 వేతనంతో పని చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాల మీద ఆశతో వేతనాలు పెరుగుతాయని, పర్మనెంట్ అవుతామని 9 సంవత్స రాలుగా కళ్ళు కాయలు కాసేలాగా చూసి గత్యంతరం లేకనే సమ్మెలోకి వెళ్ళారని ఇప్పటికీ 23 రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి కనీసం చలనం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఒంటెపాక వెంకటేశ్వర్లు, ఆ సంఘం మండల గౌరవ అధ్యక్షులు గొర్ల యాదగిరి, మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా లలిత, శ్రీలత, యూనియన్ నాయకులు బాలకృష్ణ, నవనీత ,రేణుక ,లక్ష్మి పాల్గొన్నారు.