Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-వేములపల్లి
ఐకేపీ కేంద్రాల్లో యుద్ధప్రతిపాదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం మండలంలోని బుగ్గ బారు గూడెంలో ఐకేపీకేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్రాల్లోని ధాన్యానికి మద్దతుధర చెల్లించాలని, నాణ్యతపేరుతో ధర తగ్గించవద్దని డిమాండ్ చేశారు.45 రోజులుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండకు ఎండి,వానకు తడిసిపోవడం వలన రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.కేంద్రాల్లో టార్ఫాలిన్లు, మంచినీరు,కరెంట్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలగకుండా ప్రతి గింజనూ కొనుగోలుచేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు.నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు వేగవంతం చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.అకాలవర్షాలకు అక్కడక్కడా ధాన్యం తుడుస్తుందని కావున రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రైతుసంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.వారి వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,డీవైఎఫ్ఐ జిల్లాఅధ్యక్షులు రవినాయక్, వేములపల్లి వైస్‌ఎంపీపీ పాదూరు గోవర్దన శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.