Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని లక్కారం గ్రామంలోని సర్వేనెంబర్ 50లో నూతన కోర్టుకు రెవెన్యూ అధికారులు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారని, నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరుచేయాలని కోరుతూ మంగళవారం చౌటుప్పల్ న్యాయవాదులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన కోర్టు భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏర్పాటుచేస్తామని చెప్పినట్టు న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాడూరి పరమేశ్, సహాయకార్యదర్శి జెల్ల రమేశ్, కోశాధికారి మహిపాల్‌రెడ్డి, లైబ్రరీ సెక్రటరీ జక్కర్తి శేఖర్, మహిళా రిప్రజెంటేటీవ్ స్వాతి, సీనియర్ న్యాయవాదులు తడక మోహన్, కానుగు వెంకటయ్య, మక్తాల్ నర్సింహా, నాగరాజు, శ్రీశైలం, ఎమ్‌డి.ఖయ్యుమ్ పాషా ఉన్నారు.