Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ-నకిరేకల్
పేద ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉండేది ఎర్రజెండానే అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అన్నారు. మేడే సందర్భంగా శాలిగౌరారం మండలం బండమీదిగూడెం గ్రామంలో జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పేదలకు కష్టాలు, కన్నీళ్లు ఉన్నంత కాలం ఎర్రజెండా వారికండగా ఉంటుందన్నారు. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పారు. సమస్యలపై పోరాడే ఎర్రజెండా ప్రజలు అండగా ఉండాలని ఆమె కోరారు. దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద అరాచకాలు పెరిగిపోయాయని, వాటిని తిప్పికొట్టడం ఎర్రజెండాల వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. రాబోయే కాలంలో బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించే శక్తులతో కలిసి పోరాటాలు నిర్మిస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చలకాని మల్లయ్య, సీనియర్ నాయకులు తేలు కుంట్ల జగన్ కల్లూరి లింగయ్య డెంక లింగయ్య, మండల నాయకులు ఎర్ర రమేష, మక్కా బుచ్చి రాములు ,శీను, గుండ్లపల్లి వెంకన్న, గుండాల సత్యనారాయణ, కిరణ్ కుమార్ ,ముర్రే సత్తయ్య, నాగరాజు ,నర్సయ్య,లింగయ్య కుర్ర అంజయ్య ,కప్పల శీను, పర్వతం మల్లయ్య, రాములమ్మ, లింగమ్మ ,శోభ పాల్గొన్నారు.