Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీకోసం ముఖ్యమంత్రికి లేఖ రాస్తా
- సమ్మె అణచివేత అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం
- ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
- తెలంగాణ ఏర్పడ్డాక జేఏసీ ఏర్పడలేదు
- ఎన్జీవోలు జేపీఎస్‌ల వెన్నంటే ఉండాలి
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జూనియర్, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైనది.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరిగే వరకు పోరాడి, సాధించి ప్రజల్లో భాగస్వామ్యం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం జేపీఎస్‌లు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె బుధవారానికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఆయన తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఎల్లవేళలా అందుబాటులో వెన్నంటి ఉంటానని హామీఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమ్మె చేసే హక్కు లేదు. మీరు ఉద్యోగంలో వెంటనే చేరాలని అల్టిమేటం జారీ చేయడం సరైనది కాదన్నారు. సమ్మె ప్రజాస్వామిక, రాజ్యాంగ ప్రాథమిక హక్కు. సమ్మెలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అణచివేత ధోరణి విడనాడాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాలన చేస్తూ ఉన్నామని చెబుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దక్కిన సమ్మెహక్కులను అణిచివేత విధానాన్ని అనుసరించడం సరైనది కాదన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, మంత్రిమండలిలో భాగస్వామి పూర్తి నిర్ణయం తీసుకునే హక్కు ఉందని తెలిపారు. అది లేకపోతే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి జేపీఎస్‌లతో రాయించుకున్న మూడేళ్ల వెట్టి చాకిరి ఒప్పందం పూర్తయిందని, నాలుగవ ఏడుకు మల్లి కాగితం ఇచ్చినం అది కూడా పూర్తయిందని, ఇంకా ఎంతకాలం వెట్టి చాకిరీ చేపిస్తాం అనుమతి ఇచ్చి ఉత్తర్వులు జారీ చేపించాలని మంత్రిని డిమాండ్ చేశారు. ఎంతో ఒత్తిడితో సమయానికి మించి పనిచేస్తున్న జేపీఎస్‌లను రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. సంబంధిత శాఖ మంత్రి అల్టిమేటం జారీ చేసిన ధైర్యంగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఎల్లవేళలా అందుబాటులో వెన్నంటే ఉంటానని తెలిపారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటమే సమ్మెకు పరిష్కారమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం ఉండదని ముఖ్యమంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. జరిగే ప్రతి బడ్జెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏది సాధించాలన్న పోరాటమే శరణ్యం.. ఆరాటం చేస్తే ఏది రాదని కొద్దిమందికే న్యాయం జరుగుతుందని, చరిత్రలో పోరాటం ద్వారానే అందరికీ న్యాయం జరిగిందని తెలిపారు. ఎన్జీవోలు జేపీఎస్ లకు తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వెన్నంటే ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగాక వ్యక్తులతో తప్ప జేఏసీ ఏర్పడలేదని ఆరోపించారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణ జరిగే వరకు పోరాటం కొనసాగించాలని జేపీఎస్‌లకు పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో జరగబోయే ప్రతి పోరాటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నాయకత్వం వహించాలన్నారు.
యూటీఎఫ్ మద్దతు...
జేపీఎస్‌లు చేస్తున్న సమ్మెకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా కార్యదర్శి నడపరాజు వెంకన్న, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళి, మండల బాధ్యులు కే.సైదులు తదితరులు పాల్గొన్నారు.