Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ఉపాధిహామీ చట్టంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలోని ఉపాధిపని ప్రదేశాన్ని సందర్శించి మాట్లాడారు. వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నారు. ఈ చట్టం కింద అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.మోడీ అధికారంలోకొచ్చిన 8 ఏండ్లలో ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదలను కూలీ పనులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ చట్టం అమలులో అనేక అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు.పని ప్రదేశంలో సౌకర్యాలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు.కూలీలకు ప్లై స్లిప్పు ల ఆధారంగా వేతనం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వేసవిలో టెంట్లు, మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, జిల్లా కమిటీ సభ్యులు అరే రామకృష్ణా రెడ్డి, ఉపాధిమేట్లు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.