Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండలకేంద్రంలోని ఎంఎస్ భవనంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు శాంతియుతంగా సమ్మె చేస్తుండగా ప్రభుత్వం ఈనెల 9వ తేదీ సాయంత్రం లోపు విధుల్లో జాయిన్ కావాలని లేని యెడల విధులను తొలగిస్తామని బెదిరించడం సరికాదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్కె.యాకుబ్ అన్నారు.బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 11 రోజులుగా శాంతియుతంగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యల్ని విని పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బెదిరింపులకు దిగడం సరికాదన్నారు.నాలుగేండ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వారు రెగ్యులర్ చేయాలని కోరుతున్నారని అదేవిధంగా విధుల్లో ఉంటూ మరణించిన కుటుం బాలను ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో దోసపాటిసుధాకర్, సైదులు, వెంకన్న, రామ్గౌడ్, బొమ్మకంటి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.