Authorization
Wed March 26, 2025 03:45:48 am
- డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్
నవతెలంగాణ-చివ్వెంల
రైతులు ధాన్యాన్ని తేమ శాతం 17 లోపు వచ్చేదాకా అరబెట్టుకుని తీసుకురావాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తెలిపారు.బుధవారం మండలంలోని మొగ్గయ్యగూడెం( పీపీసీ) ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.ధాన్యం శుభ్రం చేసుకోవాలని, బిల్లులు త్వరగా పెట్టాలని అదేశించారు.ఆయన వెంట ఎంపీటీసీ కోడి బండ్లయ్య, భీమ్లాతండా సర్పంచ్ ధరావత్ హముడా, మండల సమాఖ్య అధ్యక్షురాలు తూముల జయలక్ష్మి, ఏపీఎం రాంబాబు, రైతులు పాల్గొన్నారు.