Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరపత్రాలు విడుదల
నవతెలంగాణ-చౌటుప్పల్
రొడ్డ అంజయ్య వర్థంతి సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మికసంఘం మండల ప్రధానకార్యదర్శి బొజ్జ బాలయ్య పిలుపునిచ్చారు. బుధవారం పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం-సవాళ్లు అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సు కరపత్రాలను ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఈ నెల 12న మండలకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని, దీనికి నిరసనగా అంజయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వెంకటరాములు, రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహా, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, నాయకులు బోయ యాదయ్య, మానె సాలయ్య, యాట బాలరాజు, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, సిలివేరు పెంటయ్య, బోరెం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.