Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండరూరల్
ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకుఉచిత బీమా సౌకర్యం కల్పించడంతో పాటు అందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలములోని కాకుల కొండారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే సందర్భంలో ఎలాంటి ప్రమాదం జరిగిన లేబర్ కార్డు లేకపోవడం మూలంగా నష్టపరిహారం రావడం లేదని ముఖ్యంగా శ్రమచేసి సమాజానికి బువ్వ పెడుతున్న వ్యవసాయ కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూటికి 80శాతంగా ఉన్న పేదలను వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టజీవులను ఎన్నికల అప్పుడు పావుల్లా వాడుకుంటున్న పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీలు పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వంరోజు కూలి రూ.272 ఎక్కడ కూడా రావడం లేదని వందకు మించి పడకపోవడం మూలంగా కూలీల శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని నిర్ణయించిన ప్రకారంగా మే నెల ఎండలను దష్టిలో పెట్టుకొని కార్మికులకు తగిన వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పనిచేస్తున్న చోట ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని చట్ట ఉద్దేశాన్ని నీరుగారుస్తూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనను విరమించుకోవాలని లేనిచో కూలీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ,మండల నాయకులు భూపాలు, సంఘం గ్రామ అధ్యక్షురాలు తండు పార్వతమ్మ కార్యదర్శి పాలకూరి రమేష్ నాయక్ ుకులు వీరమల్ల రాములమ్మ, జనగాం పాపయ్య. కుడుతల యాదయ్య. యాశ బోయిన లింగమ్మ. మామిడి బుచ్చిరెడ్డి, చెనగోని వెంకటేశ్వర్లు, వంగూరి రాధమ్మ ,బాకీ పుష్పమ్మలి, తదితరులు పాల్గొన్నారు.