Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గంలో 13003 యూనిట్లు
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న 2వ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ వారు 2వ విడత గొర్రెల పంపిణి కార్యక్రమం పై గొల్ల, కుర్మల సహకార సొసైటీల సభ్యులకు అవగాహన సదస్సు లు గొర్ల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్లు , వెటర్నరీ డాక్టర్ల సమక్షంలో సలహాలు సూచనలు ఇస్తూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గొల్ల, కుర్మలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని అధికారులు కోరుతున్నారు. యూనిట్ కాస్టు 1,75,000 కాగా, సబ్సిడీ 1,31,250 రూపాయలు. ఇందులో లబ్ధిదారుని వాటా 43,750, రవాణా ఖర్చులకు 6500 , ఇన్సూరెన్స్ ?5,000, మెడిసిన్ ఖర్చులు 500 రూపాయలు, దాన కర్చు 3,500, గొర్రెల ఖర్చు 1,54 వేల రూపాయలు కేటాయించబడ్డాయి. నేను ఇట్లా వారిగా ఆలేరు ఒక వెయ్యి 542 యూనిట్లు కాగా , గ్రాంటెడ్ 930, బ్యాలెన్స్ 612, ఆత్మకూర్ ( ఎ%శీ%)1588, యూనిట్లు కాగా గ్రాంటెడ్ 848 బ్యాలెన్స్ 740,బొమ్మలరామారం 1148 యూనిట్లు కాగా , గ్రాంటెడ్ 655, బ్యాలెన్స్ 493 యూనిట్లు, మోట కొండూరు 1390 యూనిట్లు కాగా గ్రాంటెడ్ 805, బ్యాలెన్స్ 585 , రాజపేట 1648 యూనిట్లు కాగా గ్రాంటెడ్ 863,బ్యాలెన్స్ 785 , తుర్కపల్లి 1367 యూనిట్లు కాగా గ్రాంటెడ్ 790, బ్యాలెన్స్ 572 , గుండాల 2163 యూనిట్లు కాగా గ్రాంటెడ్ 1233, బ్యాలెన్స్ 920, యాదగిరిగుట్ట 2157 కాగా గ్రాంటెడ్ 1269, బ్యాలెన్స్ 888 గ రాష్ట్ర సామర్థక వెటర్నరీ అధికారులు నిర్ధారించారు.నియోజకవర్గంలో మొత్తం యూనిట్లు 13003 కాగా గ్రాంటెడ్ 7 393, బ్యాలెన్స్ 5610 పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది.
గొర్ల పంపిణీ బృహత్తర పథకం
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన గొర్ల పంపిణీ పథకం బృహత్తరమైనది. గొర్రెల సంపదను పెంచడానికి , గొర్ల కాపరుల ఆదాయం పెంచడానికి, గొర్రెల పెంపకం, పంపిణీ పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ యువతకు జీవనాధారం కల్పిస్తుంది.గొర్ల కాపర్లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గొర్ల కాపరులకు, పశుసంవర్ధక అధికారులు ,వెటర్నరీ డాక్టర్లు, గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్లు, గొర్రెల పంపిణీ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు.అవగాహన కల్పిస్తున్నారు.