Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
- మౌలిక వసతులు
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
నవతెలంగాణ - భువనగిరి
నేను రాను కొడుకో సర్కారు బడికి అనే నానుడి నుండి ప్రస్తుతం సర్కారు బడులవైపు తిరిగి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సువిశాలమైన భవనాలు, శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం కోసం క్రీడాస్థలాలు, క్రీడా సామగ్రి, అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు కలిగి ఉన్నాయి. మౌలిక వసతులు కలిగి ఉన్నాయి. తరగతి గదులు విద్యార్థులకు వెలుగు గాలి వచ్చే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు కట్టడాలు ఉన్నాయి. జిల్లాలో 11 ప్రభుత్వ కళాశాలలు 30 మోడల్ కళాశాలలు, గురుకుల కళాశాలలు, కేవీజీబీ కళాశాలలో ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము 96 మంది కాంట్రాక్టు లెక్చలర్లను జిల్లా లోని నియామకాలను చేశారు. జిల్లా లోని ఆలేరు మినహ అన్ని కళాశాలలో క్రీడా స్థలాలు కలిగి ఉన్నాయి. అధునాతన సౌకర్యాలతో ల్యాబ్ లు, క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. అత్యుత్తమమైన బోధన జరుగుతుండడంతో విద్యార్థులు గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని భువనగిరిలో బాలికల జూనియర్ కళాశాలకు గతం కంటే డిమాండ్ పెరిగింది.
డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నాం
ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రోహిణి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల వసతులు సౌకర్యాల అధ్యాపకుల గురించి కలెక్టర్ ఆదేశాల మేరకు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నాం. విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా కృషి చేస్తున్నాం. ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు తలదన్నే విధంగా భవనాలు, తరగతి గదులు, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేశారు. అన్ని కళాశాలలో స్వచ్ఛమైన మంచి నీటిని వాటర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా అందిస్తున్నాం.
మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ
జిల్లా కార్యదర్శి వనం రాజు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వము లేక స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు తమ నిధుల నుండి కేటాయింపులు చేయాలి. భువనగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుండి కేంద్రీయ విద్యాలయం నూతన భవనంలోకి తరలించాలని కోరారు. ఖాళీగా ఉన్నా అద్యాపకులను భర్తి చేయ్యలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర కళాశాలకు కిటికీ అద్దాలు ఏర్పాటు చేయడంతో పాటు రంగులు వేయాలని కోరారు. జూనియర్ కళాశాల మధ్య స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని కోరారు. పరీక ఫలితాలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది.