Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలొని ఉమ్మడి రాచకొండ గ్రామపంచాయతీ పరిధిలో రూ.1.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.రాచకొండ గ్రామంలో రూ.25 లక్షలతో సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులకు,రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా,కడిలబావి తండాలోరూ.25 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం పనులకు,తుంబావి తండాలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.వెంకంబావి తండాలోరూ.25 లక్షలతో సీసీ రోడ్లు, 20 లక్షలతో మురికి కాల్వల నిర్మాణం పనులు, రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అనంతరం రాచకొండ మహా శివాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. తూం బాయి తండలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం ను పరిశీలిం చారు.మహమ్మదాబాద్ గ్రామ పరిధిలో సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్,పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి,ఎంపీటీసీ శివరాత్రి కవిత సాగర్,సర్పంచులు, ఎంపీటీసీలు,మన్నే ఇంద్రసేనారెడ్డి,పల్లె గోవర్ధన్ రెడ్డి,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పద్మ శాలి యువజన నాయకులు సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.