Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేపల చెరువు పనులను పరిశీలించిన డీఆర్డీఓ
నవతెలంగాణ-మునుగోడు
ఉపాధి హామీ పనులలో కూలీలు గరిష్ట వేతనం పొందేలా పనులను చేయాలని డిఆర్ డి ఓ కాలిందిని ఉపాధి కూలీలకు సూచించారు గురువారం మండలంలోని సింగారం గ్రామంలో ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న చేపల కుంట పనులను పరిశీలించారు అనంతరం మండల ఎంపీడీవో కార్యాలయం లో రికార్డులను పరిశీలించి ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం విజయభాస్కర్ , ఏపీవో శ్రీనయ్య తదితరులు ఉన్నారు.