Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్ టౌన్ సీఐ రౌతు గోపి
నవతెలంగాణ -నల్లగొండ
ఎస్పీ అపూర్వరావు సూచనల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం సౌండ్ పొల్యూషన్ చేసేటటువంటి వాహనాలపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ,ఏడు బుల్లెట్ వాహనాలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు సీఐ రౌతు గోపి తెలిపారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేయగా అవి మోడీపై చేసినటువంటి సైలెన్సర్స్ గా గుర్తించి ఆ వాహనం నడుపుతున్నటువంటి వ్యక్తులపై ఎం వి యాక్టివ్ ప్రకారంగా కేసు బుక్ చేసి సౌండ్ పొల్యూషన్ చేసేటటువంటి సైలాన్సర్స్ ను తొలగించి వాటి స్థానంలో కంపెనీ సైలెన్సర్ ఫిట్ చేయించి వాహన యజమానులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు.