Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అడ్డగూడూరు
మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో శుక్రవారం ఘనంగా కంఠమహేశ్వరస్వామి ప్రతిష్ఠాపన నిర్వహించారు. కంఠమహేశ్వరస్వామి దేవాలయం దాతగా గ్రామ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్ , టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ సహకారంతో నిర్మించారు. కంఠమహేశ్వరస్వామి పండుగ 10న బుధవారం నుండి 14 వరకు పూజలు నిర్వహిస్తున్నారు.శుక్రవారం ఉదయం యంత్ర ప్రతిష్ఠాపన చేసి మధ్యాహ్నం జలాబిషేకం చేసి విగ్రహాలు ప్రతిష్ఠాపన చేశారు. శనివారం బోనాలు, గంపలతో నైవేద్యం కులదైవాలకు సమర్పించి ఆదివారం బందుమిత్రులతో విందు చేయనున్నారు . ఈకార్యక్రమంలో ఆలయ దాత నారగోని అంజయ్య గౌడ్ ,పెద్ద గౌడ్ బండి భధ్రయ్య ,సారగౌడ్ బొమ్మగాని ఉప్పలయ్య, గౌడసంఘం ఆలయ కమిటీ పెద్దలుపాల్గొన్నారు.