Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
జూనియర్ పంచాయతీ అధికారులు, అవుట్సోర్సింగ్్ పంచాయతీ అధికారులు చేస్తున్న సమ్మెకు శుక్రవారం బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే కెసిఆర్ నిరంకుశ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. అదేవిధంగా ఈ సమ్మెకు మాజీ ఎంపీ రవీందర్ నాయక్, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు (అల్లం దేవి సర్పంచ్) సుర్వి యాదయ్య గౌడ్ వేర్వేరుగా మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్, సీనియర్ నాయకులు బట్టు రామచంద్రయ్య, గంధ మల్ల లింగస్వామి, అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుండు కష్ణ గౌడ్, అసెంబ్లీ కోశాధికారి బండారు జహంగీర్, భువనగిరి పట్టణ అధ్యక్షులు బర్రె నగేష్, నాయకులు కొంగరి బాలరాజు పాల్గొన్నారు.