Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
నవసమాజ నిర్మాణంతో పాటు, రాజ్యాధికారం కోసం బంజారాలు, గిరిజనులు ఏకం కావాల్సిన అవసరం ఉందని అందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలోని గిరిజన సమస్యలపై ఈనెల 18న గిరిజన నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అద్యక్షులు కిషన్ నాయక్ తెలిపారు. భువనగిరి పట్టణంలోని రహాదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న గిరిజన ప్రజలను మేలుకొల్పడానికి, , గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడిన డిమాండ్ తో పాటూ, ఇతర గిరిజన సమస్యల పై జిల్లా కేంద్రం లోనీ ప్రభుత్వ రహాదారి బంగ్లాలో ఉదయం 11 గంటలకు ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలోప్రధాన కార్యదర్శి కెతావత్ సోమ్లాల్ నాయక్, కార్యదర్శి బానోతు సురేష్ నాయక్, జిల్లా అధ్యక్షుడు బిక్షపతి నాయక్, 32వ వార్డు కౌన్సిలర్ బానోతు వెంకట్ నాయక్, కేతావత్ తిరుపతి నాయక్, జానయ్య, బానోతు శకృనాయక్ పాల్గొన్నారు.