Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్‌క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆదర్శ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షూగర్, బీపీ, దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆదర్శ్ అధ్యక్షులు డాక్టర్ నాళం వెంకటేశ్వర్లు, ప్రతినిధులు నేతి విప్లవ్‌కుమార్, ఎస్.ప్రభాకర్, యాదయ్య, చంద్రశేఖర్, డాక్టర్ సురేశ్, పెండెం శంకర్ పాల్గొన్నారు.