Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యపు తోటలో
జ్ఞాన ఫలాలను పండిస్తున్న తోటమాలి
జ్ఞానార్జన తపనయే గాని
గర్వమొకింత తెలియని నిగర్వి
ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే తత్త్వాన్ని
తనువెల్లా నింపుకున్న నిరాడంబరుడు
నిత్య విద్యార్థియై
నిరంతరం శ్రమించే నిత్య కృషీవలుడు
మాటలను పొదుపుగా వాడినా
అదుపులేని విజ్ఞానం వెదజల్లే మితభాషి
శత్రువుతో సైతం చిరునవ్వులతో కరచాలనం
చేయగలిగిన స్మితభాషి
కాఠిన్యపు హ దయాలను సైతం
కరిగించగల మ ధుభాషి
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు అనే భావాన్ని
అణువణువునా నింపుకున్న హితభాషి
కష్ట సుఖాలను నాణేనికి ఇరువైపులని తలచి
పొంగిపోని కుంగిపోని గంభీరమూర్తి
సమాజ హితానికై సతతం పరితపించే నిత్య స్ఫూర్తి
పసి హ దయాలను గెలిచిన విజేత
తరగతి గదిలో జ్ఞానకిరణాలు విరజిమ్మే సూరీడు
సాగర్ల సత్తయ్య
కవి
నల్లగొండ
7989117415