Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాయాగావ్ లో పుట్టారు
పూలే గారితో జత కట్టారు
జనం వెతలు పసిగట్టారు
విమర్శలను వదిలి పెట్టారు
సమాజ శ్రేయస్సుకు నడుం కట్టారు,
నవసమాజ నిర్మాణం చేపట్టారు,
నారీమనులకోసం పోరాడారు
వీరనారిగా విశ్వఖ్యాతి కెక్కారు
బాల్యవివాహానికి తల వొంచారు, భర్త ఇచ్చిన భరోసాతో అక్షరాలు దిద్దారు ,
విజ్ఞాన జ్యోతులు వెలిగించారు
మూడాచారాలు మూలకు నెట్టి
చీకటి బ్రతుకుల వెలుగులు నింపి సంఘ సంస్కర్త మీరయ్యారు
ఆరోజుల్లో
ఎన్నో అవమానాలు భరించారు
మరెన్నో చీత్కారాలు చవిచూశారు
వాటన్నిటినీ ఎదిరించారు
నిరంతరం పోరాటం చేశారు
స్త్రీ విద్యకై ఆరాట పడ్డారు
ధైర్య శాలిగా నిలబడ్డారు
బాలికా పాఠశాలను స్థాపించారు
అందరికీ ఆదర్శంగా నిలిచారు
వితంతువులకు నమ్మకం కల్గించారు
కుల కుచ్చితాలను అధిగమించారు
వారందరి కోసమే నిలిచారు
దీరవనితగా పేరు పొందారు
సమాజకట్టు బాట్లనే తొలగించారు
దీన జనోద్దరణకై పాటుపడ్డారు
మహిళా భ్యుదయానికి పునాది వేశారు
అభ్యుదయ వాదిగా నిలిచారు
మహౌన్నత వ్యక్తిగా పేరు పొందారు
మహామేధావి గా చరిత్రకెక్కారు
ప్రథమ మహిళా ఉపాధ్యా యినీ
సావిత్రీ బాయీ!!
మీ ఆదర్శం మాకు సదా స్మరణీయం
మీ మార్గం మాకు సదా ఆచరణీయం
రజియా
ఉపాధ్యాయిని
చింతగూడెం, అనుముల మం.