Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్కు 195, కాంగ్రెస్కు 94
- అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు...
నవతెలంగాణ నల్లగొండ ప్రతినిధి
జిల్లాలో మొదటి విడతలో నిర్వహిం చిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ రేసింగ్తో దూసుకు పోయింది. ప్రధాన ప్రతిపక్షా పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందిన పంచాయతీలు ఉన్నాయి. ఏదేమైనా టీఆర్ఎస్ స్థానికంగా పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యింది. మొదటి విడత ఫలితాల ప్రభావం ఈ నెల 25 , 30 తేదీల్లో జరిగే రెండు, మూడు విడతల ఎన్నికలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈనెల 21న దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడతకు సంబంధించిన పది మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చారు. రెవెన్యూడివిజన్ పరిధిలోని మొత్తం 304 గ్రామ పంచాయతీలో అత్యధికంగా టీఆర్ఎస్ 195 గ్రామాల్లో పట్టు సాధించింది. కాంగ్రెస్ 94 గ్రామాల్లో మాత్రమే గెలుపొందింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో గ్రామాల అభివద్ధి అధికార పార్టీకే సాధ్యంమన్న కోణంలో స్థానిక సంస్థలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు అధికారం కట్లటబెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ఈ నెల 25న మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, 30న నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగే ఎన్నికలపై పడనున్నట్టు ప్రజా నాడి వెలుబుచ్చుతుంది.
రెండు మండలాల్లో కాంగ్రెస్ ఉనికి..
పది మండలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు మండలాల్లో తన ఉనికిని చాటుకుంది. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం 20 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 4 గ్రామాలు టీఆర్ఎస్ గెలుపొందింది. ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు.నాంపల్లి మండలంలో 14 స్థానాల్లో గెలుపొందింది.
పంచాయతీ ఎన్నికల్లో పది మండలలో వివిధ పార్టీలకు వచ్చిన అధిక్యం...
మండలం మొత్తం టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ సీపీఐ బీజెపీ స్వతంత్రులు
దేవరకొండ 39 24 14 - 01 - -
కొండమల్లెపల్లి 26 22 03 - - - 01
డిండి 38 29 06 - 02 01 -
చందంపేట 28 20 08 - - - -
నేరడుగొమ్ము 19 12 07 - - - -
చింతపల్లి 34 21 09 01 - 01 02
పీఏపల్లి 31 20 08 - - - 03
గుర్రంపోడు 37 26 10 01 - - -
నాంపల్లి 32 17 14 - - - 01
మర్రిగూడ 20 04 15 - - - 01
మొత్తం 304 195 94 02 03 02 08