Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు నువ్వు దొరకడమే అదృష్ట మన్నావు,
నేను నిన్ను చూడని బ్రతుకే బతుకు కాదన్నావు,
నీవు లేనిదే క్షణమైనా నేను వుండలేవన్నావు,
నేను నీతో మాట్లాడనిదే నిదుర రాదన్నావు,
నేను చూసినప్పుడల్లా నవ్వుతూ వుండాలన్నావు,
నువ్వు నాకు ఎప్పుడూ కనపడుతూనే వుండాలన్నావు,
నాకు నిన్ను చూస్తేనే ఆకలి దప్పులు లేవన్నావు,
నీ మాటలే నాకు అమృత పు వాక్కు లన్నావు,
నా జీవిత మే నీవు, నా ప్రాణం లో ప్రాణం నీవన్నావు,
చివరికి నా జీవన చక్రానికే నీవు బ్రేకులు వేశావు,
నిన్నెంతో ప్రాణానికి ప్రాణం లా ఆరాధించిన నేను,
నిన్నే ప్రేమించానని నువ్వు నా వెంట పడ్డావు,
ఎందుకో నువ్వు, అధఃపాతాళానికి నెట్టేశావు నన్ను,
నా హృదయాంతరాళలో శీతల ఆవాస మొకటి నిర్మించా,
నీ ఎద లోతుల లోకి వెళ్లి చూడు, ఆరని చితాగ్ని కనిపిస్తుంది,
అయినా నీ రూపం, నీ చూపు నీ ఆలోచనలే నా చుట్టూ,
నీవే నన్ను నా హృదయాన్ని పిప్పి చేసి గాయ పరచావు
--శ్రీ చింతపట్ల వెంకట రమణా చారి.