Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం రాచరిక పాలన కింద
బానిసలుగా బ్రతుకుతున్న తెలంగాణ ప్రజల కన్నీటిని
అగ్నిధారగా మాలిచిన ఘనుడు దాశరథి.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గొంతెత్తి నినదించిన ఈ పద్యం తొలి, మలి ,ప్రత్యేక తెలంగాణ సాధనలో ముందుండి నడిపించింది అనడంలో అతిశయోక్తి లేదు .
బహుముఖ ప్రజ్ఞావంతుడు, స్నేహశీలి, నిరాడంబరుడు స్వచ్ఛమైన భావుకత ఆయనలో తొణికిసలాడుతూ ఉంటాయి. కోపం ,చిరాకు ,అసహనం, అసంతృప్తి అనేవి ఎప్పుడు ప్రకటించేవాడు కాదు.యువతరానికి స్ఫూర్తి నింపే వ్యక్తి.
మంచి వ్యక్తిత్వం గల దాశరథి కృష్ణమాచార్యులు
1927 సెప్టెంబరులో తెలంగాణ ఖమ్మం జిల్లా మానుకోట తాలూకా లోని గూడూరు గ్రామంలో జన్మించాడు. పండిత వంశంలో పుట్టిన తాను తన చిన్నతనంలోనే పాండిత్య జ్ఞానం సంపాదించాడు.మెట్రిక్యులేషన్ వరకు ఖమ్మంలో చదువుకున్నాడు. నిజాం ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా అగ్నిజ్వాలగా మండాడు. తెలుగు భాష వ్యాప్తికి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు.కళాప్రపూర్ణ తో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండిడాక్టరేట్ పొందాడు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా కొంతకాలం సేవలందించాడు. 1987 నవంబరు 5వ తేదీన మరణించాడు. లంకగా గాక కైలాసముగా జగము రాణించు నటువునా చైతమురమ్ము
ఈ పునాది రచనలో ఎవరనిది పైచేయి
కవిది లోకజ్ఞానిది ఇదీ గంభీరునిది నీది
అని పలికిన దాశరథికి స్వస్థాన వేషభాషాభిమానం ఉంది .
పద్యం ,గేయం ,వచనం ప్రతి ప్రక్రియను సృజించి తన ప్రతిభను చాటాడు.
ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ని బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి, అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ నిజాం దురాగతాలను ఆకృత్యాలను ఎలుగెతాడు. దాశరథి అనగానే నిజాం వ్యతిరేక ఉద్యమ కవిత్వం వెంటనే గుర్తుకు వస్తుంది.జైలు గోడల పై రాసిన ఈ పద్యం అగ్నిని కురిపిస్తుంది. ఇట వసంతము లేదు సహింపరాని గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని ఇట ఉషస్సులు లు లేవు భరింపరాని అంబు వాహనం దోహ నివాళి గాని మహాకవి దాశరథి అను వ్యాసంలో జి.వి.సుబ్రహ్మణ్యం దాశరథి కవిత విశ్వరూపాన్ని మన ముందుంచాడు.నిజాం నిరంకుశ పాలనలో ప్రజల బాధ హృదయవిదారకంగా వినబడుతుంది.
సామాన్యుల రక్తం పిండి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కసాయి ప్రభుత్వం చేసే అరాచక కృత్యలకు కవి అంతరంగం అగ్నిగుండంలా మండింది. దాశరథి నాలుక మీద నుండి అగ్నిధార కవిత ఆవిర్భవించింది.
అది తెలంగాణలోన దావాగ్ని లేచి చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ అది నిజాము నృపాలుని అండ దండ చూచుకొని నిక్కి నట్టి పిశాచ హేల ఇందులో చుట్టుముట్టిన,నిక్కీనటి నానుడులు వీరత్వానికి సహకారాలుగా ఉన్నాయి.
సామాన్యుల జీవితాలు దుర్భరమైనయి. మానభంగాలు సరేసరి నిజాం కాలంలో తెలుగు మాట్లాడడానికి వీలు లేదు.ఆస్తుల దోపిడి, గృహ నిర్భందాలు, అమానుష దారుణకాండ, దుస్సహ, దృష్టకృత్యాలు తెలంగాణని నరక లోకంగా మార్చాయి.దాశరథి తన కవిత్వంను విల్లులా ఎక్కుపెట్టి ఆ విల్లు నుండి వెలువరించిన దివ్యశ్రమే ఈ పద్యం.
ప్రాణములొడి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచిమా
గాణములన్ సృజించి ఎముకలో నుసి చజేసి పొలాలు దున్ని లో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపినరైతుదే తెలం
గాణ ముసలి నక్కకు రాచరికం దక్కునే
నిజాం రాజును పిశాచం అనడం, ముసలి నక్క అనడం, మా నిజాం నవాబు జన్మజన్మల అనడానికి ఎన్ని గుండెలు కావాలి దానికి ఫలితంగా ఇనుప గొలుసులు వరించాయి.నిజామాబాద్ సెంట్రల్ జైలు నివాసస్థలం అయింది. దాశరథి లో నిరసన మరింత తీవ్రమైంది.దాశరథి ప్రేక్షకునివలె కాక ప్రజల కష్టనిస్టురాలలో తానొకడుగా కలిసిపోయాడు.
తెలంగాణ ప్రజల స్వతంత్ర ఉద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వం.నను కని పెంచినటి కరుణామయి నా తెలంగాణ.అని పొంగిపోయాడు.కునుకు లేకుండా కటికనేల మీద మనసుకు శరీరానికి స్వేచ్ఛ లేని బందీఖాన యుగంలో తీవ్రమైన అనారోగ్యం నిత్యం ప్రాణ భయంగా ఉండే నిజాం కాలంలో ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తెలంగాణ వజ్రాయుధం దాశరథి....
-- పోల్కం రాములు
తెలుగు ఉపన్యాసకులు ఆర్జీయూకేటీ బాసర
చరవాణి:9494934629
gmail:ramulu.p007@gmail.com