Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్నిధారను కలంలో కురిపించి నిజాం నవాబుల గుండెల్లో నిదురించిన నిఖార్సైన ఓరుగల్లుకవి
"తీగలు తెంపి అగ్నిలోన వేసినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ "అంటూ రుద్రవీణను పలికించాడు
"నిజాం రాజు జన్మజన్మల బూజు"
అంటూ బొగ్గుతో ఇందూరుకోట జైలుగోడలు నింపి తెలంగాణ తెగువను చూపించాడు
"ఆచల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో"అంటూ చక్కని గేయాలతో
తెలుగు ప్రజల నాలుకలమీద ఎల్లకాలం నర్తిస్తూనే ఉన్నాడు ఎన్నో అద్భుతమైన కవనాలు పూయించి సాహితీ వనంలో
ఎల్లలెరుగని పరిమళాలను పంచుతూనే ఉన్నారు అమరకవి కృష్ణమాచార్యులు
కమ్మని పాటలను చిత్రసీమకందించి ఆపాతమధురాలతో పాఠకుల హృదయాలను కొల్లగొట్టిన కవి దాశరథి
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి తెలుగు ప్రజల్లో సాహితీ చైతన్యాన్ని నింపినాడు
ఆంధ్ర సారస్వత పరిషత్తు రూపశిల్పులలో ఒకరై ఆంధ్ర కవితా సారధి యై
తిమిరంతో సమరం చేస్తూ మహాంధ్రోదయాన్ని కాంక్షించే ధ్వజమెత్తిన ప్రజ లలో ఆలోచనాలోచనలు కల్పిస్తూ
రుద్రవీణ ను మీటుతూ గాలీబ్ గీతాలు పాడుతూ నేత్రపర్వంగా కవితా పుష్పకం లో అగ్నిధారను ఒలికించిన కవిసింహం మన దాశరథి కృష్ణమాచార్యులు
అతను జన్మించిన నేలపై నా జననం గమనం తలుచుకుంటేనే హృదిలో ఉప్పొంగె పులకింతల జల్లులు
అందుకే జన్మదిన కానుకగా నా ఈచిన్ని అక్షరనివాళి అందుకో దాశరథి
వకుళ వాసు
హన్మకొండ
vakulavasu@gmail.com