Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతడు నిరంతరం సాహిత్య సేధ్యం
తెలంగాణ వైతాళికులు
అభ్యుదయ అక్షరాలను
నిజాంపై ఎక్కుపెట్టిన ప్రళయ
కవితా మూర్తి,సాహిత్యసారది.
కవిత్వం లో దృశ్యమానం చేయటం వారికేసాటి
నా తెలంగాణ కోటి రతనాల వీణ అనిపాడినవాడు
ఆచల్లని సముద్ర గర్భం పాటలో
భూమి పుట్టుక,మానవ పరిణామం
శాస్ర్తీయ అనగాహన,కవిత్వంగా మలిచినవాడు
పోరాటతత్వం ఒక ఎత్తైతే ,ప్రశ్నించేతత్వం
సత్యాన్వేషణ మరో ఎత్తు.
సామాజిక తెలంగాణ నిర్మాణానికి
నిర్భందాలను ఎదుర్కొని
నిలిచిన మహాకవి,విశ్వకవి
మిమ్మల్ని చూసి,పువ్వులే వికసిస్తాయి
కవుల కవితా సాగరాలు.
సాహితీ గగనంలో పండు వెన్నెలలు
అభ్యుదయ కాగడా ధరించిన కవిరత్నాలు
చిన్న కవులను ఎత్తుకున్న మహోన్నతులు
సాహిత్య శిఖరం చూసినవారు.
మరణం మీ వ్యక్తిత్వానికి,సాహిత్యానికి కాదు, దేహానికే్
మీ గుండే శబ్దహొ భాండారినిది.
మూర్తి మత్వం,కవిత్వం స్నేహపాత్రం.
మీ కలం,గళం సాహిత్యానికి నిధి.
సాహితీ సేద్యంలో తెలంగాణ మట్టిపరిమళం.
అక్షరానికి అభిషేకం, ప్రాసలకు నడక నేర్పిన,
పాటలకు ప్రాణం,గజల్ కు గానగంధర్వం.
మీ వ్యక్తిత్వమే మాకలాలకు ఓనుమాలై
శాశ్వతంగా నిలిపే
మహాకవులకు అక్షర నివాళులు
-ఎం డి. ఖాజామైనద్దీన్ మహబూబ్ నగర్ 9396626276