Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీసం
మహబూబునగరమ్ము ,మహిజన్మమిచ్చెను
మధురతెలంగాణ.,మాన్యమయ్యె
సంస్కృతాంధ్రములను ,సారస్యమందెను
బహుగ్రంధరచనాన ,పండితుండు
కవనపాండిత్యాలు ,కల్హారమాలలు
కవితపుష్పకమున ,రవిగవెలిగె
విప్లవాగ్నిరగుల ,విశ్వవేదీకపైన
సమరశంఖమూదె ,సవ్యసాచి
తే.గీ.
పూనియుద్యమస్ఫూర్తితో.పు
జైలుగోడలరచియించెమేలుకవిత
రుద్రవీణలమ్రోగించి ,రుద్రుడయ్యె
ధరణికవిరాజువర్యుని ,తలతుమదిని.
ఆ.వె.
పద్యమాయుధమ్ము ,పగతురభయపెట్ట
ఉద్యమంబుశ్వాస ,నుర్విరక్ష
శరపరంపరలకు ,సారధిగను
దాశరథియెకవన శరథికాగ.
ఆ.వె.
తరతరాలబూజు ,ధరణిలోనైజాము
దుష్టతనమునితడు ,డొల్లసేసి
కవనబాణమేసి ,కదనముసేసెను
జాగృతమ్ముజగతి ,జయముకాగ.
తే.గీ.
మాతెలంగాణచైతన్యమాన్యదీప్
నిత్యకల్యాణకాంతులు ,సత్యమయ్యె
కోటిరతనాలవీణను ,కోరితెచ్చె
మేటిసంస్కర్త ,ధీరుడు.,మించుకీర్తి.
కం.
తిమిరములబాప ,కవియై
సమరమ్మునుజేసినాడు ,సంకెలతొలగన్
దమనపుకాండలద్రుంచెను
రమణీయపుపథముజూపి ,రంజిలచేసెన్.
-డా.వేదాలగాయత్రీదేవి
విశాఖపట్టణం
చరవాణి;9885871464