Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూడు సూడు 'నారన్నా'
ఊరు నిన్ను పిలుస్తోంది
'మూలవాగు' బాధ జూడు
తాపతాపకు తలుస్తోంది ||సూడు||
ఉరుకుడాపి 'మానేరు'
నీ పాటే పాడుతోంది
నీ అడుగు జాడలను
మైలురాళ్ళుగ పాతింది ||సూడు||
'ఏములాడ, సిరిసిల్ల'లు
నీ పేరును జెపిస్తుంటె
'హనుమాజీ పేట' నేడు
మొగులుముట్ట ఏడుస్తోంది ||సూడు||
గోదావరి 'గంగమ్మ'లు
గోడుగోడున ఏడుస్తోంటె
'యమున, కృష్ణ, సరస్వతి'
గోసజూడ తరంగాదు ||సూడు||
'తల్లి తెలంగాణ' సూడు
తల్లడమల్లడ మైతంది
కోటానుకోట్ల తెలుగుజాతి
పబ్బతివట్టి మొక్కుతోంది ||సూడు||
ప్రతి ఊరు పల్లె పల్లె
మా నారాయణరెడ్డి కవి
మల్లమల్ల పుట్టాలని
బోనమెత్తి వేడుతోంది
(మాకు జీవధాతువు 'బాపు' సినారె కు)
- డా. పత్తిపాక మోహన్