Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన కలంతో అక్షరాలను చెక్కుతూ. కమనీయమైన భావాలను వెలువరిస్తూ .
సూటిగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయే.
కవితా బాణాలను సంధిస్తూ.
అణిచివేతకు గురైన సమాజానికి .
వెలుగు రేఖలు ప్రసాదిస్తున్న కవితా సూర్యుడు.
ఆయన వెలువరించిన కవితా ఝరి .
సెగలు కక్కుతున్న లావాలా ప్రవహించి .
గుండె గుండెకు మంటను రగిలిస్తూ.
పొగల సెగల మధ్య నిప్పురవ్వలు చైతన్యమై.
ఆరని ఉద్యమ చిచ్చు రేపుతూ.
ఆగ్రహజ్వాలలై ఎగిసిపడుతూ.
నిజామ్ గుండెల్లో నినాదాలై.
నిప్పుల వర్షం కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది.
కోటి రతనాలకు ప్రాణం పోస్తూ .
ఆయన విసిరిన అక్షరాలే .
తెలంగాణ అంతటా చైతన్యవారధిగా మారి. ఉద్యమ ప్రేరణగా నిలిచాయి.
ముసలి నక్కకు ముక్కుతాడేస్తూ.
తెలంగాణ రైతుని గగనసీమలో ఆవిష్కరిస్తూ. పీడిత ప్రజల గొంతుకై నినదించారు.
అగ్నిధార రుద్రవీణను కవితా పుష్పక విమానంలో. ఊరేగిస్తూ తిమిరంతో సమరం చేస్తూ .
సమాజంలో మార్పు కోసమే తీర్పునిస్తూ.
ధ్వజమెత్తిన ప్రజాను నేత్రపర్వంగా చిత్రిస్తూ.
ఆంధ్ర కవితా సారథిగా వెలుగొందారు.
తెలంగాణకు పట్టిన పిశాచం దుమ్ము దులుపుతూ. దొరల దురాగతాలను ఖండిస్తూ .
సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న.
తెలంగాణ సమాజాన్ని ఓ దరికి చేరుస్తూ .
కవన ఖడ్గాన్ని జలపించారు.
అమరవీరుల ఆశయాలకు ప్రాణం పోస్తూ.
ఉద్యమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ .
కోకిల గొంతులకు గానమందించారు.
అభ్యుదయ భావాల ఆచరణలో.
అలుపెరుగని పోరాటం చేస్తూ .
ఊహల్లో విహరిస్తున్నా కవితా భావాలను భూమ్మీదికి దించి.
వాస్తవ కవితా వనం సృష్టిస్తూ .
అభ్యుదయ కవితా చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచారు.
---మద్దిరాల సత్యనారాయణ రెడ్డి.
తెలుగు ఉపాన్యాసకులు.
ఆర్.జి.యు.కె.టి...బాసర.
చరవాణి:9502771776..