Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి:
సార్థక నామధేయ ఓ దాశరథీ! సుందర సుమధుర సాహిత్యశరధీ
అతులితామృత కవితానిధీ అపార పాండిత్యానికి ప్రియ సన్నిధి
చరణం:
వేంకటమ్మ వేంకటాచార్యుల ముద్దుల తనయా
చినగూడూరుకు ఖ్యాతి తెచ్చిన చెలిమ హృదయా
నిజాము నిరంకుశ పాలనపై
పోరు సలిపిన కవితా వీరుడా
నా తెలంగాణ కోటి రతనాల వీణ యని
ఘోషించిన అక్షర సూర్యుడా
ఓ రధీ ఓ సుధీ దాశరథీ
చరణం:
అలతి అలతి పదాలతో
అపురూప భావాలు పొదిగినావు
ఖుషీ ఖుషీ భావాలతో
హుషారు కలిగించి నిషాతో ముంచినావు
ఎంత చూచినా తనివి తీరదు
నీ గీతికా కన్యక సోయగము
ఎంత తలచినా మనసు నిండదు
ఆ కవితాత్మక మాధుర్యము
సత్పధీ, సుహృదీ దాశరథీ
- వి.భీమేశ్వర ప్రసాద్
తెనాలి, గుంటూరు జిల్లా 8897659364