Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు అక్షరానికి తన కలం హలంతో వన్నెచిన్నెలద్దిన రైతుబిడ్డ
పాటల పూదోట మాగాణంలో విరిసిన చల్లని వెన్నెలరేడు
పంచెకట్టులో మెరిసిపోయే సారస్వతమూర్తిమత్వ స్వరూపుడు
సమ్మోహనపరిచే మార్దవగళంతో శబ్దమాధుర్యాన్ని వాచస్పత్యాన్ని
ఔపోసన పట్టిన అభినవ కాళిదాసు ... అజాతశత్రువుగా ఒద్దికైన సౌమ్మతతో
సత్యాన్ని తన కవిత్వంతో సౌందర్యంగా రూపుదిద్దిన అలుపెరుగని సాహితీహాలికుడు
వన్నెతగ్గిని గురుశిష్య సంబంధాలకు సిసలైన ఆచార్యుడిగా
అమూల్యస్నేహ బంధానికి పటిష్టవారధిగా..సంగీతసాహిత్య సమలంకృతుడిగా...
ఉర్దూభాషాముద్దుబిడ్డడుగా... తన గజల్స్ గానామృత రసఝరితో మూలవాగును
మళ్ళీ ఉరకలెత్తించిన సాహితీరసపిపాసకుడు...
నిరుపేద పశులపోచి అంబలి తాగిన నిగర్వి
వితరణకు మారుపేరైన బహుదొడ్డ మనస్సుగల అభ్యుదయవాది
ఏ ఇజానికి లొంగని విశ్వంభరుడిగా నిత్యచైతన్యశీలి
నూత్న సృజనాపటిమ గల బహుముఖీన ప్రజ్ఞాదురంధరుడిగా
విభిన్న కావ్య ప్రక్రియలకు కొత్త సొబగులు అద్దిన మాంత్రికుడు
బిరుదులెన్ని పొందినా ... స్తుతులెన్ని చేసినా మతిని పోగొట్టుకోక
తను పుట్టిన పల్లెను మరువని ఈ పసిపాపడు...
కొందరివాడిగాకాక అందరివాడయ్యాడు!!
- బి.కళాగోపాల్
నిజామాబాద్ ,9441631029