Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సి. నా. రె
పల్లవి: ఆషాడ పున్నమిన పుట్టిన సినారె
మన తెలుగులో వెలుగులు నింపినాడే
చరణం: కవితలూ కృతులనూ రాసినాడే
అమృతపు పదజల్లు కురిపించినాడే
మల్లారెడ్డి బుచ్చమ్మల యింట వెలసినాడే
చల్లని వెన్నెలకే అందమును తెచ్చినాడే
మధ్యతరగతి బతుకులనూ చూపించినాడే
మననసులోని సంఘర్షణ తొలగించినాడే......ఆషాడ
చరణం: విశ్వంభర కావ్యమును రాసినాడే
మానవ పరిణామక్రమమూ తెల్పినాడే
ఙ్ఞాన పీఠమునూ పొందినాడే
మనదేశ ఖ్యాతి ని చాటినాడే
యువతలో విప్లవజ్వాల రగిలించినాడే
మానవ దృక్పదంలో మార్పుతలచినాడే.....ఆషాడ
చరణం: పద్యాలు గేయాలు గజల్లు రాసినాడే
వచన కవితలకు వన్నెనూ తెచ్చినాడే
పాలనా రంగంలో పదవులు చేపట్టినాడే
తెలుగు భాషకూ మెరుగులు దిద్దినాడే
పద్మశ్రీ పద్మభూషణ్ పొందినాడే
కళామతల్లి నెంతెంతో మురిపించినాడే.....ఆషాడ
చరణం: కవితలతో యువవృద్దులను మేల్కొల్పినాడే
శబ్ధస్పూర్తితో చైతన్యం కలిగించినాడే
కథలు కధనాలు వ్యాసాలు రాసినాడే
సమాజ శ్రేయస్సుకు తోడ్పడినాడె
సింగిరెడ్డి నారాయణ రెడ్డిగారే
పురస్కారాలతో పునీతుడయ్యినాడే ....ఆషాడ
గంజి కళావతి,
నల్లగొండ, 9912589703.