Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాషకు సరి కొత్త సొబగులు దిద్ది
విశ్వంభరుడుగా తాను పేరు పొంది
బహుభాష వేత్తగా సాహిత్యమున వెలిగి
గేయకవి గా మారేను మన సినారె
తెలంగాణ చరితకే తలమానికమైన
కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో
సింగిరెడ్డి వంశాన బుచ్చమ్మ మల్లన్నలకు జన్మనొందే కవిగా,పండితునిగా వాసికెక్కే
ప్రపంచ పదులలో అంతఃప్రాసను వాడి
ప్రపంచ జనులకు భవిత తోవ చూపె
మధ్యతరగతి మందహాసమై వికసించి
మానవ జీవనశైలి మార్గం వేసే
నాగార్జున సాగరం,మట్టి మనిషి, ఆకాశం నడక నా తల్లి,
ఇంటి పేరు చైతన్యం అక్షరాల గవాక్షరాలు లాంటి
ఆణిముత్యాల రచనలు చేసి ఉన్నత పదవులను అలంకరించే.
ఆధునీకాంధ్ర కవిత్వం-సంప్రదాయాలు ప్రయోగాలు పరిశోధన గ్రంథం తో
విశ్వకీర్తి గాంచి తెలుగు భాషకు సరికొత్త శైలి చూపి సినారె
ఆచంద్రతారార్కానం వెలుగునొందే
చలనచిత్రాలలో స్తీ రూపు వర్ణించే
తెలుగు గజళ్ళు లో ప్రభలు చిందే
జ్ఞానపీఠం తోడ ఘనుడయ్యి పేరొంది
పద్మభూషణుడయ్యి పరిమళించే
- చిలకమారి తిరుపతి
స్వరమయూరి
9640908491
చెన్నూర్