Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటను సరసమున చిరుగాలి గా
ఊగించిన రసమయ స్వాప్నికుడవి
శ్రీ సినారె శ్రీ సినారె // పాట//
చూపు కదిలిన
చిత్రంగ కవిత జారె
పెదిమ కదిపిన
గజల్ గా మారె //పాట//
అక్షరమే ఆయుధమై
పోరాటం చేసె
పది మందికి మార్గదర్శిగ
బాటలు వేసె //పాట//
--యలమర్తి అనూరాధ, హైదరాబాద్
చరవాణి:9247260206