Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్యములు-
ఉ: పండిత మండితుండు,పరభాషల
కెక్కిన సత్కవీంద్రుడున్
గుండెలనిండ మానవత,కూరిమి
తాలిమి మేళవించుచున్
పండిన పాండితీ గరిమ ప్రాకెస్వదేశ
విదేశ మంతటన్
పండుగ నీ కవిత్వ మన పండిత
పామర కోటికెల్లడన్
ఉ :చక్కని రూపురేఖలవి, శాంత స్వభావము ,సౌకుమార్యమున్
చుక్కలనంటె కీర్తి,పరిశోధన జేసిన గ్రంథమున్ గనీ
గ్రక్కున కేలు మోడ్చి, ఘనకావ్యధురీ
ణుడటంచు కోవిదుల్
చొక్కిరి సంబరంబునను క్షోణితలంబున
సత్కరించచున్
సీ: హన్మాజి పేటలో నావిర్భవించినా
వాణిముత్యంబుగా నలరినావు
తల్లితండ్రుల నీవు దైవంబుగానెంచి
భక్తి శ్రద్ధలు గల్గి వరలినావు
రైతుకుటుంబాల ఖ్యాతిని బెంచుచు
పేదల పెన్నిధై వెల్గి నావు
దీనజనాళికి దీవెనలందించు
కవితలు వ్రాసిన కవివరుడవు
తే: వక్త,పరిశోధ నాగ్రణీ ప్రణతు లిడెద
నల్లరేగడి దున్నిన నాన్నగారు
ఉల్లమును దోచుకున్నమ హోన్నతునకు
గ్రంథ మంకితమిడినట్టి ఘనత నీది
సీ: పద్యంబు వ్రాసినా హృద్యంబు గానుండు
ఉతృష్టభావాలతో సి నారె
గద్యముల్ వ్రాసినా గంగా ప్రవాహమై
ఓలలాడుచునుండు నో సినారె
గేయముల్ రచియింప హాయిని మదినిల్పు
తూగుటూయలలోన తూగినట్లు
గళమెత్తి పాడగా కమ్మని యాగజల్
నిద్రాణ శక్తుల నిద్ర లేపు
తే: మట్టి మనిషిని మలతువు మణుల రీతి
దిట్టవన్ని ప్రక్రియలలో తిరుగులేని
సాహితీ క్షేత్రమందున సంచరించి
జ్ఞానపీఠము నెక్కిన ఘనుడ వీవు
సీ: నవ్వని పువ్వుతో నావిర్భవించిన
కావ్యకన్యకవైతి కన్న తండ్రి
సురుచిర కావ్యాలు శోధన గ్రంధాలు
తెలుగు గజల్లను తెచ్చినావు
చలనచిత్ర రథపు సారథిగామారి
శ్రావ్య గేయాలెన్నొ వ్రాసి నావు
విశ్వంభర కావ్యవిరచితమ్మును జేసి
పారి తోషికముతో వరలినావు
తే: జాలువారిన కవితల జాడ చూడ
వెలసె నగణితమై ధర వేల కొలది
సర్వ సాహితీ ప్రక్రియ సమరమందు
విజయ కేతన మెత్తిన విబుధ వర్య
సీ: అధికార భాషకు నధ్యక్షులుగ నుండి
తెలుగుకు వన్నెలు తెచ్చినావు
సంస్కృతీ మండల చైర్మన్ గ నుండుచు
సంస్కారమందించి సాగినావు
రాజ్యసభలయందు రాచరికము జేసి
న్యాయ పోరాటాన నడచినావు
పలుయూనివర్సిటీల్ ప్రతిభను గుర్తించి
గౌరవ డాక్టరేట్ ఘనత నిడిరి
తే: వివిధ విశ్వవిద్యాలయ ప్రీతి బడసి
తెలుగు భాషావధూటిని తీర్చి దిద్ది
శిష్య గణనుతులందిన శ్రేష్ఠ మతివి
అమ్మ వాగ్దేవి కృపనంది నట్టి దిట్ట
- శ్రీరామోజు లక్ష్మీరాజయ్య
విశ్రాంత తెలుగు అధ్యాపకుడు
సిర్పూర్ కాగజ్ నగర్ - 504296
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్రము
8790652828 .