Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప: అలుపెరగని ఓ! అక్షర శిల్పి
అగుపడరావేమయా మరోమారు
మాకు అగుపడరావేమయా
చ. మీ పుట్టినరోజు వేడుక సేయ
గుబాళించెనయ గులేబాకావళి
కవితా సుందరి కరములు ముడిచి
వందనములిడె ఈ సంధ్యావేళన
చ. విశ్వంభర నీ కవితా సుమములు
మా జ్ఞాన జ్యోతులను వెలిగించెనయ
మీ రసానాన్మిత కవితా ఝురిలో
రహినోందితిమి మేమందరము
చ. మీ పుట్టిన రోజని తెలిసిన క్షణమే
రవరవలాడైగ ప్రమదావనము
పున్నమినీడన వెన్నెల వాడన
మీకై పుష్పించెను నా కవితాసుమము
చ. కన్నె కవితకు వన్నెలు అద్ది
చిత్రపరిశ్రమ సిగ్గులు చిదిమి
ఉలకని పలకల శిలలకు సైతం
ఊపిరులో సగిన కవితా కాపరి
చ. రామప్ప గుడి ముఖద్వారముపై నిలిచిన
నాగకన్నవళి వంపులు తడిమె
మీ కవితా సుమశరముల వాడివేడి
కాదనగలర మరి ఏ కవులైన
చ. నాంపల్లి నగముపై వెలిసిన
ఆ నారసింహుడు సతీసమేతుడై
దీవెనలిడి మిము మా కొసగెగదయ్యా
బడలిక ఎరుగని కవితా వల్లభ
కరుణచూప కదిలిరా! భువికి
చ. పుడమి పలకపై పులకించిన నీ పాట
కలల అలలపై తేలె మామది ఈ పూట
అందుకొనుము మా హృదయాంజలి
జ్ఞానపీఠ పద్మభూషణ కవితాగ్రేసర
రావయ్య మముచేర మరోమారు భువికి
---గజవెల్లి 8985754016