Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగమలు పదనిసలు సరసమైన గమాకాలు !
రస కవితకు చతురతకు చిరస్మానియా చమత్కారి !
విరహాన్ని కళ్ళలో చూపిన విప్లవాన్ని కలంతో నేర్పరి !
కవిజ్ఞాన రచయితని జ్ఞానపీఠమే సత్కరించే !
రాజన్న సిరిసిల్ల జిల్లాలో హనుమాజీపేట గ్రామంలో జన్మించిన సినారే!
ఆచార్య సింగిరెడ్డి నారాయణ అసలు పేరు (సినారే)
విశ్వాన్ని గెలిచినోరు విజేతలు కారురా !
విశ్వాసం కలిగినోళ్ళు విజ్ఞాన గురుతులు చూ సీనారే !
వికృత క్రియల సిరియా విశాల జీవితాలు లేక
ప్రశాంత అడుగులు వే సినారే !
నరమేధం రక్తస్నానం తమ ప్రాణాలను
చీకటిలో దా సినారే !
శాంతి వైపు అడుగులేసి స్వేచే పతాకాన్ని తెచ్చే సినారే !
తమ ఉనికికీ మరో మరణాన్ని కోరిన అమెరికా
ఆ జపానును శిదిలము చే సినారే !
ఆర్థిక గెలుపులకోసం ఆయుధ విచక్షణతో
శవాలను మొ సినారే !
జరుగుతున్న మరణ హోమాలు చూస్తూ
మానవ కలమే కదిలి విశ్వంభర రా సినారే
విచక్షణ కోల్పోయి విలువలు మరిచిపోయి
విలాసాల కొరకు పోయి
పిల్ల జల్లా ముసలి
ముతక గొంతుకలునూ ఉగ్రవాదీ కో సినారె !
ఆధిపత్య ధోరణులతో అమాయకపు
ఆస్తులను దో సినారె !
నియంతలా దారుణాలు
శవాలుగా పో సినారె !
సర్వ సార్వభౌమ అక్షర రాజ్యం నీ సినారె!
వీధి బడి విశ్వంభర అక్షర వీరుడా అందుకోనా అక్షర నివాళి.... సినారె!
-నెల్లుట్ల సునీత
7989460657
కలం పేరు శ్రీరామ