Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ కలం నుండి జాలువారిన అక్షరం,
జేగీయ మాన సాహితీ వటవృక్షం!
మీ ఆలోచనలో మెరిసిన కవనం,
వేల యుగాలైనా వాడని తెలుగు పూలవనం!
మీ స్పర్శలో ఒదిగిన ప్రతీ తెల్లని కాగితం,
మనోల్లాస ప్రియగీతికల నృత్య వేదిక!
మీ మధుర కవితానదీప్రవాహం,
ఆబాలగోపాల పఠనా వ్యామోహం!
మీ గుండె ఊటన ఊరిన ప్రతీ పాట,
నేటి కలాలకందని తేనెల తేట!
మీ భావనల వర్షించి చరితకెక్కిన ప్రతీగ్రంథం,
అనుభవ జీవన సాంగత్యాలకవసరం!
మీరాతైనా,మాటైనా,వరించిన పదవీ ప్రతిపత్తులైనా
కలమైనా, గళమైనా సినీవినీలకాశ సింగిడిలైనా, మీరే
విశ్వంభరులై విరిసినారె!!
ప్రపంచ హృదయాలపై చెరగని ముద్రలేసినారె!!
-జగదీశ్వర్ మడుపతి
ప్రభుత్వ ఉపాధ్యాయులు
నారాయణ ఖేడ్
సంగారెడ్డి జిల్లా.
9494817919