Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినారె పుట్టినూరు
హన్మాజీ పేట అల్లాడిపోతోంది
సినారె చదువుకున్న ఊరు
సిరిసిల్లా చిన్నబోతోంది
మాకు పేరుతెచ్చిన'కవి,బాపూ' ఇకలేడని..
తెలుగు అక్షరాలు తల్లడిల్లు తున్నాయి
ప్రతి పుట్టినరోజున కొత్త పుస్తకానికి జన్మనిచ్చే
మా " కవి బ్రహ్మ " ఇకలేడని..
తెలుగుభాష దీనంగా దిక్కులు చూస్తోంది
తన' కలం గళం ' తో ఘన కీర్తి తెచ్చిన
మా "మధుర కవి " ఇకలేడని..
తెలుగు చలనచిత్ర కళామతల్లి
కలత చెందుచున్నది
'ఇగిరిపోని గంధమంటి' పాటలు అందించిన
పదాలకు పరిమళం అద్దిన
మా " కవి సినారె " ఇకలేడని..
సినారె సినీ గీతాభిమానుల హృదయం
ఇప్పుడు పాడుతోంది విషాద గీతం
సినీ గీతాలతో 'పగలే వెన్నెల 'కురిపించి
పద సౌందర్యంతో పాటకు 'నిన్నలేని అందమేదో తెచ్చిన'
మా "అభిమాన కవి " ఇకలేడని..
వర్ధమాన కవులు దిగులు చెందుచున్నారు
అడిగినంతనే' కవితా సంపుటాలకు 'ముందు మాటరాసిన
మా " ఆత్మీయ కవి " ఇకలేడని..
__బూర దేవానందం
9494996143.
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా