Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెన్నవంటి మనసున్నవానికి
అన్నమేమొ కఱవాయెని,
నవవర్ష ప్రాయమున అన్నదాతపై వ్రా'సినారే'!
పదునెనిమిది వర్షములకు
దేశభక్తుడవై జాతిపితపైనా వ్రా'సినారే'!
షష్టిపూర్తికి భావపుష్టిలో స్రష్టవై,
'విశ్వంభర'తో వినుతికెక్కి,
జ్ఞానపీఠమధిరోహించినారే!
జ్ఞానం మాకుంచి, పీఠం స్వర్గానికి
మార్చుకున్నారా కవీశ్వరా!
పద్యం హృద్యం, వచనం ప్రవచనంగా ఈలోకాన సత్కవీంద్ర సభలనలరించి అలరించి,
నాకమున మహేంద్ర సభన రంభోర్వశుల పదనర్తనానికి 'పద'
నర్తనమందించ చనినారా!
పార్ధివశరీరం పృధ్విలో కలసినా,
నీ కవిత్వ పటుత్వ ప్రాభవమ్ము
శాశ్వతం!
నీ ఘనకీర్తి అజరామరం, అజరామరం!
-చమత్కారకవి కె. ఎల్ కామేశ్వర రావు
కార్యదర్శి
లావణ్య సాంస్కృతిక సంస్థ
హైదరాబాదు. సెల్ : 9441583506.